Group 2 Mains Postpone: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల విధానాల్లో లోపాలను మార్చాలని గ్రూపు 2 అభ్యర్థులు ఆందోళన బాట పట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడిట్లు తెలుస్తోంది. నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టడంతో ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే న్యాయస్థానంలో పరీక్ష వాయిదాకు నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: APPSC Group 2 Mains: రేపే ఏపీ గ్రూపు 2 పరీక్ష.. వాయిదా కోసం నిరుద్యోగుల ఆందోళన ఉధృతం
విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుందని సమాచారం. న్యాయ నిపుణుల అభిప్రాయం అనంతరం గ్రూప్-2 వాయిదా వేయాలా? లేదా అనేది ప్రభుత్వం సమాలోచనలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి 11వ తేదీన జరగనుండగా.. అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: IPS Officers: తెలంగాణ ఐపీఎస్ అధికారులకు షాక్.. ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఉన్న స్టడీ కేంద్రాల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టగా.. విజయవాడ, వైజాగ్‌లో కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. ఏపీ గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షల రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన లోపాలను మళ్లీ ఈ ప్రభుత్వం చేయవద్దని గ్రూపు 2 అభ్యర్థులు ప్రార్థిస్తున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలను తప్పులు సరిచేసి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.