Telangana Drugs Case: తెలంగాణలో డ్రగ్స్ వాడకం అనే మాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలన్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకుగాను కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28న ప్రగతిభవన్‌లో "స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్" నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు.
ఇక సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సదస్సులో తెలంగాణ హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు. తెలంగాణలో డ్రగ్స్ (Telangana Drugs) వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
ఇక తెలంగాణలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై తాజాగా ప్రగతి భవన్‌లో (Pragati Bhavan) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, (CS Somesh Kumar) డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.
Also Read : Chhattisgarh: సీఎం వరాల జల్లు... ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే పని..
డ్రగ్స్ వినియోగంలో దోషులుగా తేలితే వారు ఎంతటి వారైనా కూడా కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1000 మందితో కూడిన బృందంతో ప్రత్యేకంగా "నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్" (Narcoti, Organised Crime Control Cell) పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక ఈ ప్రత్యేక విభాగం డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఇతర వ్యవస్థీకృత నేరాల్ని నియంత్రించేందుకు అలాగే కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనుందని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు.
Also Read : Lasith Malinga: ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook