Former CS SV Prasad Passes Away: కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఎస్వీ ప్రసాద్ సహా ఆయన కుటుంబసభ్యులకు కరోనా సోకింది. భార్య, కుమారుడితో పాటు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో నేటి ఉదయం ఎస్వీ ప్రసాద్ తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ‘ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్.వి. ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని’ తెలంగాణ సీఎంవో ఈ మేరకు ట్విట్ చేసింది.
Also Read: Bank Timings In Telangana: లాక్‌డౌన్ పొడిగింపు, మారిన బ్యాంకు పనివేళలు, కొత్త టైమింగ్స్ ఇవే
ఏఎస్ఎస్ ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఉమ్మడి ఏపీలో 2010లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. అనంతరం కొణిజేటి రోశయ్య హయాంలోనూ సీఎస్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా సేవలు అందించారు. కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడిన ఆయన భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook