KCR Meeting With MLAs and MPs: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు 8 వారాల విరామం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎడమ కాలి తుంటి ఎముక గాయం నుంచి కోలుకున్న కేసీఆర్.. ఈ రోజు అసెంబ్లీలో మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కేసీఆర్ రీఎంట్రీతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ పెరిగింది. రానున్న పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇంకా కాలిగాయం నుంచి పూర్తిగా కోలుకోని కేసీఆర్ వీలుచైర్లోనే ఉంటూ జిల్లాల వారిగా ప్రచారం చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జిల్లాల వారిగా అన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల గురించి జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పక్కాగా పది ఎంపీ స్థానాలలో గెలవాలని ప్రయత్నిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా మీటింగ్‌లు నిర్వహించి పునసమీక్షించకున్న గులాబీ నేతలు పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించి కార్యకర్తలలో జోష్ నింపాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల అమలు లక్ష్యంగా చేసుకుని జనాలలోకి వెళ్ళి ప్రశ్నించాలని యోచిస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావు పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. అనంతరం నంది నగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి దేశానికి ఆదర్శంగా నిలిపిన BRS పార్టీ మాత్రమే రాజీలేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.
కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం పరిసరాలు జనసందోహంతో నిండిపోయింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుని వచ్చిన తనను కలవడానికి వేలాదిగా అసెంబ్లీకి తరలివచ్చిన పార్టీ నేతలు అభిమానులను అధినేత పేరు పేరునా పలకరించారు. ఈ సందర్భంగా బొకేలు శాలువాలను అందించి తెలంగాణ సాధకుడు తెలంగాణ ప్రగతి ప్రదాత, తమ అధినేతతో అభిమానులు తమ అప్యాయతను పంచుకున్నారు. అభిమానుల కోరిక మేరకు వారితో కలిసి కేసీఆర్ ఫోటోలు దిగారు. అనంతరం నంది నగర్లో కూడా ప్రజలు కేసీఆర్‌ను కలిశారు.
Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్ చేసి పిలుపు
Also Read: Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter