Tamilisai Soundararajan: కేసీఆర్ సర్కార్ పై పోరాటంలో తగ్గేదేలే అంటున్నారు గవర్నర్ తమిళిసై సౌందరాజన్. తన అధికారాలను ఉపయోగిస్తూ ప్రభుత్వానికి షాకులు ఇస్తున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమిళి సై.. ఇప్పుడు స్వయంగా యాక్షన్ లోకి దిగారు. రాష్ట్రంలో ఇటీవలు జరిగిన పలు ఘటనలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అయితే గవర్నర్ గవర్నర్ తమిళి సై తెలంగాణలో ఇటీవల జరిగిన ఆత్మహత్యలు, అత్యాచారపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు .
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేష్ ఆత్మహత్య, మెదక్ జిల్లాకు చెందిన రామాయంపేటకు చెందిన తల్లి, కొడుకు కామారెడ్డి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాష్ట్రంలో దుమారం రేపాయి. అధికార పార్ నేతల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గవర్నర్ తమిళిసై ఈ ఘటనలకు సంబంధించి మీడియా కథనాలను పరిశీలించారు. ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ కమలం నేతలు గురువారం గవర్నర్‌ను కలిసి వీటిపై వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన గవర్నర్.. అధికారుల నుంచి నివేదిక కోరారు.
యాదాద్రి జిల్లాలో కలకలం రేపిన రామకృష్ణ పరువు హత్య, కోదాడలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపైనా వివరాలు అడిగారు తమిళి సై. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెడికల్ పీజీ సీట్ల బ్లాక్ దందా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనా ఛాన్సలర్ గా గవర్నర్ స్పందించారు. ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్ర విద్యార్థులు.. ఈ బ్లాక్ దందాతో మెడికల్ సీట్లను కోల్పోయే అవకాశం ఉందని, ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీసీని ఆదేశించారు గవర్నర్. రాష్ట్రంలో జరిగిన ఘటనలపై గవర్నర్ నివేదిక కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలా నివేదికలు అడగడమంటే ఒకరకంగా పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కొంత కాలంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలున్నాయి. ఇటీవలు గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. ఇటివల గవర్నర్ జిల్లాలలో పర్యటించిన మంత్రులు, అధికారులు పట్టించుకోలేదు. దీనిపై బహిరంగంగానే తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తో విభేదాలున్నాయని గవర్నరే స్వయంగా చెప్పారు. కేసీఆర్ తీరుపై కేంద్రం పెద్దలకు తమిళి సై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ డైరెక్షన్ లోనే తాజాగా ఆమె యాక్షన్ లోకి దిగిందని అంటున్నారు. మరోవైపు గవర్నర్ తమిళిసై బదిలీ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని గులాబీ పార్టీ అనుకూల వర్గాలే చేస్తున్నాయని రాజ్‌భవన్ వర్గాలు భావిస్తున్నాయి. తమిళి సై తాజా యాక్షన్ తో ఇరుపక్షాల మధ్య వార్ మరింత ముదరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ నేరుగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Also Read: Tamilisai Soundararajan News: గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అటెండర్ అనుమానాస్పద మృతి?
Also Read: Gang Rape: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం... యువతిని 30 గం. పాటు బంధించి గ్యాంగ్ రేప్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.