Prajapalana Abhaya Hastham 6 Guarantees Aplications: ప్రజా పాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీతో సహా 4,57,703 దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై నేడు జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, సందీప్ సుల్తానియాలు కూడా పాల్గొన్నారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రతీ కేంద్రంలోనూ సరిపడా ఆరు గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని ఆదేశించారు.
మొదటి రోజు గురువారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని అన్నారు. ఈ అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి తెలిపారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు గాను ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు.
రేషన్ కార్డు కచ్చితం కాదు..
రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు తెలిపారు. గురువారం నుంచి జనవరి 6 వరకు వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు చెప్పారు. అభయహస్తం 6 గ్యారంటీలకు కుటుంబం నుంచి ఒకే దరఖాస్తూ మాత్రమే సమర్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి.. రసీదు పొందాలన్నారు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధన లేదన్నారు.
ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చని.. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని.. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు రశీదు, దరఖాస్తు నంబర్ భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రజల నుంచి తీసుకున్నా దరఖాస్తులను అధికారులు జాగ్రతగా భద్రపరచాలని అధికారులకు సూచించారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter