New Year: న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు!

Hyderabad Police Restrictions : మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరగనున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 18, 2022, 09:56 PM IST
New Year: న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు!

Hyderabad Police Restrictions on New Year Celebrations: డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు ఇప్పుడు నూతన సంవత్సర వేడుకల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆరోజు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాత్రమే సెలబ్రేషన్స్ కు అనుమతి ఇస్తున్నామని, ఇక అప్పుడు పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటమని పోలీసులు హెచ్చరించారు. 

ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకు మద్యం అమ్మకాలు చేయాలి లేకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు ఒక కీలక ప్రకటన చేశారు. అలాగే స్పెషల్ న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం పది రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఇక పబ్బుల్లో కానీ స్పెషల్ ఈవెంట్స్ లో కానీ అశ్లీల నృత్యాలు చేసినా, అధిక శబ్దాలు వచ్చేలా పాటలు పెట్టినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్న పోలీసులు న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్స్, పబ్బులలో 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించారు.

సామర్థ్యం కంటే ఎక్కువగా ఈవెంట్స్ పాసెస్ లుకానీ, పబ్స్  అనుమతి ఇవ్వకూడదని, అలాగే ఈ  న్యూ ఇయర్ వేడుకల్లో  గంజాయి డ్రగ్స్, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్బులు, ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేసిన యాజమాన్యానిదే బాధ్యత అని హెచ్చరించారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్స్, పబ్బుల నుండి బయటకు వెళ్ళే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని పోలీసులు పేర్కొన్నారు.

స్టార్ హోటల్స్, పబ్స్, ఈవెంట్స్ లలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్న పోలీసులు, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా? ఆరు నెలలు జైలు శిక్ష కూడా ఉంటుందని పేర్కొన్న అధికారులు, మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమాని పై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Also Read: Avatar 2 - Narappa: అవతార్ 2 మన నారప్పే.. చూసిన వాళ్ళందరూ ఎందుకలా అంటున్నారో తెలుసా?

Also Read: Tarakaratna: వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News