Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్‌ డే

KCR Grandson Himanshu Rao Birthday Celebrations: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మనువడు టీనేజ్‌ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 12, 2024, 09:24 PM IST
Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్‌ డే

Himanshu Rao Birthday: తెలంగాణ పోరాట యోధుడు.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబంలో మరో వారసుడు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు రావు యుక్త వయసును దాటేశాడు. టీనేజ్‌ దాటేసి ట్వంటీస్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇంట్లో ఆనందోత్సాహాలు నిండాయి. అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన తన మనవడి తొలి బర్త్‌ డే కావడంతో నిరాడంబరంగా హిమాన్ష్‌ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్

 

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం హిమాన్షు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తన తాత కేసీఆర్, నాయన్నమ్మ శోభమ్మల హిమాన్షు ఆశీర్వాదం పొందారు. టీనేజ్ దాటుతున్న మనుమడికి ఇష్టంతో నాయనమ్మ 19 కిలోల భారీ కేక్‌ను తెప్పించారు. కుటుంబసభ్యులు, సిబ్బంది నడుమ హిమాన్షు కేక్ కట్ చేశాడు. అంతకుముందు పుట్టిన రోజు సందర్భంగా హిమాన్షు మొక్క నాటి నీళ్లు పోశాడు. ఈ వేడుకలో హిమాన్షు తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Also Read: Kavitha Bail: ఫలించని కేటీఆర్‌, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్‌

 

విదేశాల్లో విద్యాభ్యాసం
కల్వకుంట్ల వంశంలో మూడో తరం హిమాన్షు రావు. పెద్ద రాజకీయ కుటుంబంలో పుట్టిన హిమాన్షుకు కేసీఆర్‌, కేటీఆర్‌ లక్షణాలు వచ్చాయి. హైదరాబాద్‌లో పాఠశాల విద్యాభ్యాసం సమయంలో నాయకత్వ లక్షణాలతో పాఠశాలలో హిమాన్షు ప్రత్యేక గుర్తింపు పొందాడు. హిమాన్షు ఆధ్వర్యంలో అతడి పాఠశాలలో ఓ భారీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్య తర్వాత హిమాన్షు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్నాడు. గతేడాదే విదేశాలకు వెళ్లాడు. అయితే గతేడాది హిమాన్షు తన పుట్టినరోజు సందర్భంగా ఓ పాఠశాలను అభివృద్ధి చేశాడు. ఆ సందర్భంగా హిమాన్షు మాట్లాడిన మాటలు కేసీఆర్‌, కేటీఆర్‌ను గుర్తుకు తెచ్చాయి. భవిష్యత్‌లో కల్వకుంట్ల వంశం నుంచి మూడో తరంగా హిమాన్షు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News