Munugode Liquor Sales: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రలను వాడుతున్నాయి. ఇక మందు పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలకు డబ్బుతో పాటు చుక్క, ముక్క గ్యారంటీ. సాయంత్రం వేళ రాజకీయ పార్టీలు ప్రత్యేక ధావత్‌లు ఏర్పాటు చేస్తూ తాగినోళ్లకు తాగినంత మద్యం పోస్తున్నాయి. మునుగోడులో ఏటు చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నుంచే ఇక్కడ మద్యం అమ్మకాలు ఊపందుకోగా.. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తరువాత రికార్డుస్థాయిలో అమ్మకాలు పెరిగాయి.
ఈ నెల 22వ తేదీ వరకు రూ.160.8 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. పోలింగ్‌కు మరో 8 రోజులు సమయం ఉండటంతో మరింత జోరుగా మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెల చివరి నాటికి రూ.200 కోట్లే దాటే అవకాశం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో మునుగోడు మండలంలో ఎక్కువగా అమ్మకాలు జరగ్గా.. గట్టుప్పల్ మండలంలో తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయి.
సాధారణంగా నల్లొండ జిల్లా మొత్తం ప్రతి నెల రూ.132 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని.. కానీ మునుగోడు ఎన్నికల ప్రభావంతో ఒక్క నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇక్కడి మందుబాబులు నిత్యం మత్తులో మునిగితేలుతున్నారు. మునుగోడు ఓటర్లు ఎక్కడున్నా.. వారికి ప్రత్యేక తాయిళాలు అందజేసి ఓటు వేసేందుకు రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విందులు ఏర్పాటు చేసి ఆకర్షిస్తున్నట్లు సమాచారం.
నవంబర్ ౩న పోలింగ్ జరగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండడంతో ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: India vs Netherlands: టీమిండియా ఆటగాళ్లకు క్వాలిటీ లేని ఫుడ్.. ఏంటి మరీ ఇలానా..!
Also Read: Liger - Vijay Devarakonda : కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదా?.. విజయ్-పూరి మధ్య సంబంధాలు తెగిపోయాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి