Godavari Flood: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది. 9 గంటలకు 71.8 అడుగులకు చేరింది. తర్వాత నుంచి తగ్గడం మొదలైంది. ఉదయం 11 గంటల వరకు గోదావరి నీటిమట్టం 70.8 అడుగలకు తగ్గింది. గంటకు ఒక అడుగు తగ్గుతోంది నీటిమట్టం. మరోవైపు పోలవరం దగ్గర వరద పెరుగుతోంది. స్పీల్ వే గేట్ల నుంచి 23 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి పరుగులు పెడుతోంది. ధవళేశ్వరంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 24 లక్షల క్యూసెక్కులుగా ఉంది.