మహాకూటమిలో ట్విస్ట్ ; ఐదు స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీలు ?

                                

Last Updated : Nov 19, 2018, 02:13 PM IST
మహాకూటమిలో ట్విస్ట్ ; ఐదు స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీలు ?

మహాకూటమిలో పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు తప్పేలా లేదు .కూటమిలోని రెండు పార్టీలు ఐదు చోట్ల తమ అభ్యర్ధులకు బీఫాంలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయా స్థానాల్లో మహాకూటమిలోని పార్టీలు తలపడనున్నాయి.

ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఇబ్రహీంపట్నంలో టీడీపీ తరఫున సామా రంగారెడ్డికి టీటీడీ అధ్యక్షుడు ఎల్.రమణ బీఫాం ఇవ్వగా.. అదే స్థానంలో కాంగ్రెస్ తరుఫున మల్‌రెడ్డి రంగారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఫాం ఇవ్వడం గమనార్హం. అలాగే దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి మద్దల నాగేశ్వర్ రెడ్డి బీఫాం అందుకోగా..టీజేఎస్ తరఫున రాజ్ కుమార్ బీఫాం ఇచ్చి టీజేఎస్ పోటీకి దించుతోంది. మిర్యాలగూడలో కాంగ్రెస్ నుంచి ఆర్ కృష్ణయ్య బీఫాం అందుకోగా.. టీజేఎస్ నుంచి విద్యాధర్ రెడ్డి బీఫాం అందుకున్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ నుంచి గాయత్రి రవి..టీజేఎస్ నుంచి గాదె ఇన్నయ్య బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ టీడీపీ  నుంచి ఎర్రశేఖర్ ..టీజేఎస్ నుంచి రాజేందర్ పోటీ చేస్తున్నారు.

ఆయా స్థానాల్లో ప్రత్యర్ధి పార్టీ ఓట్లను చీల్చేందుకే మహాకూటమి నేతలు ఈ వ్యహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా స్నేహపూర్వక పోటీల అంశంపై ఇప్పటికే మహాకూటమిలో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలు ఫలిస్తే ఆయా స్థానాల్లో ఎవరో ఒకరు తమ అభ్యర్ధిత్వాన్ని చివరి నిమిషంలో ఉపసంహరించుకునే అవకాశముంది. అయితే తాజా పరిణామాలపై మహాకూటమిలోని పార్టీలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
 

Trending News