Harish Rao: ఆ ఘటన అత్యంత దురదృష్టకరం: హరీష్ రావు

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మ‌ర‌ణించారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు దిగ్భ్రాంతి (Hariah Rao On Srisailam Fire Accident) వ్యక్తం చేశారు. 

Last Updated : Aug 21, 2020, 04:46 PM IST
  • శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం
  • లోపల చిక్కుకుపోయిన తొమ్మిది మంది మ‌ర‌ణించారు
  • ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  • అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి
Harish Rao: ఆ ఘటన అత్యంత దురదృష్టకరం: హరీష్ రావు

శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం (Srisailam Power Plant Fire Accident)లో తొమ్మిది మంది మ‌ర‌ణించారు. దట్టమైన పొగల కారణంగా ఎంత ప్రయత్నించినా రెస్క్యూ టీమ్ వారిని రక్షించలేకపోయింది. ఇప్పటివరకూ అయిదుగురి మృత దేహాల‌ను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. మరో నలుగురి మృత‌దేహాల‌ను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు (Hariah Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే!

‘శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరం. ప్రమాధంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని’ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. Telangana ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే.. 
Vijay Shankar Engagement Photos: వేడుకగా క్రికెటర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం

 

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విద్యుత్ కేంద్రంలో మొత్తం 19 మంది ఉన్నట్లు సమాచారం. అయితే 10 మంది ఎలాగోలా బయటపడగా.. 9 మంది లోపల చిక్కుకుపోయారు. వారు చనిపోయారని శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos  

Trending News