Minister KTR: హైదరాబాద్‌లో మరో భారీ కంపెనీ.. తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది: మంత్రి కేటీఆర్

Foxconn Interconnect Technology in Hyderabad: కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ కంపెనీకి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. కంపెనీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు.  టెక్నాలజీ ఉద్యోగాలు 33 శాతం తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణమని అన్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : May 15, 2023, 12:35 PM IST
Minister KTR: హైదరాబాద్‌లో మరో భారీ కంపెనీ.. తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది: మంత్రి కేటీఆర్

Foxconn Interconnect Technology in Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానుంది. కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీలు, కంపెనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. రానున్న తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

'కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్‌లో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉంది. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్‌లోనూ విస్తరించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుంది. గత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. తెలంగాణ ఫర్ క్యాపిటల్ 2.5 రెట్లు పెరిగింది. దాదాపు 22,700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించాం. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం.

ఈరోజు భారతదేశం 30 సంవత్సరాల కింద చైనా ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తే 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20 వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాము. దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చింది. దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33 శాతం తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణం..' అని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని ఆయన అన్నారు. చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ వేగంపైన ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం తమ పైన ఉందని అన్నారు. ఆ దిశగా పనిచేస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ  అనుభవాలకు మించి అద్భుతమైన ప్రస్థానం ఇక్కడ కొనసాగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా.. మార్గదర్శకంగా ఉండేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తోందని అన్నారు. 

రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా ఫాక్స్ కాన్ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఫాక్స్ కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో ఉన్న విస్తరమైన అవకాశాలను కంపెనీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. తమ కంపెనీకి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కంపెనీ శంకుస్థాపన ద్వారా తెలంగాణ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాప్‌లో సుస్థిరమైన స్థానం సంపాదించుకునేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు. 

Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్  

Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News