KTR responds to 7 year old boy letter: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై కేటీఆర్ ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తుంటారు. తాజాగా ఓ ఏడేళ్ల బాలుడు రాసిన లేఖపై కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఆ చిన్నారి కంప్లైంట్‌ను వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలిచ్చారు.
సికింద్రాబాద్ బౌద్దనగర్‌కి చెందిన కార్తీకేయ అనే బాలుడు కేటీఆర్‌కు ఆ లేఖ రాశాడు. తమ ఇంటి ముందు ఫుట్‌పాత్ నిర్మాణం కోసం ఆర్నెళ్ల క్రితం తవ్వకాలు జరిపారని.. ఫుట్‌పాత్ నిర్మించకుండా రాళ్లు కప్పి వదిలేశారని లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయంలో వెంటనే స్పందించాల్సిందిగా కోరాడు. బాలుడి మేనమామ ఆ లేఖను ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్... 'క్యూట్ బట్ సీరియస్.. చిన్నారి కార్తీకేయ కంప్లైంట్' అని పేర్కొంటూ.. సమస్యను పరిష్కరించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ అధికారులను ఆదేశించారు.
మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆదేశాలతో బౌద్దనగర్‌లోని బాలుడి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడి ఫుట్‌పాత్ నిర్మాణ పనులను పరిశీలించారు. బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులతో మాట్లాడామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోమవారం నుంచి ఫుట్‌పాత్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు కేటీఆర్ వారిని అభినందించారు.
Cute but serious complaint from young Karthikeya!
Request @ZC_Secunderabad to address this personally and send me a pic of the complainant with you 😁 https://t.co/3I9HXxr8ku
— KTR (@KTRTRS) January 29, 2022
Also Read: Viral Video: ఏనుగు పాలు తాగుతున్న మూడేళ్ల చిన్నారి.. ఎంత ముద్దుగుందో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook