Minister KTR: బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీకి ఆ దమ్ముందా..?

KTR on Telangana Assembly Elections: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Jun 1, 2023, 07:12 PM IST
Minister KTR: బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీకి ఆ దమ్ముందా..?

KTR on Telangana Assembly Elections: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన మార్క్ వేసిందని.. తెలంగాణ అచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అనేది ప్రస్తుతం నినాదంగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాలన్న స్పూర్తికి అనుగుణంగా పనిచేస్తూ.. అందులో విజయం సాధించిందని అన్నారు. సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. విద్యా వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురాగలిమని.. వైద్య రంగంలో నూతన వైద్యశాలలో మెడికల్ కాలేజీలతో సమగ్రమైన మార్పు చెందిందని అన్నారు.

రాష్ట్రంలో ఎలా భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో పరిపాలన సంస్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా ముందుకు పోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందన్నారు. ఒకప్పుడు పంటలు పండని చోట.. నేడు ధాన్యం ఎక్కువైన పరిస్థితి నెలకొందని అన్నారు. 
గత తొమ్మిదేళ్లు ప్రతిపక్షాలు అసత్య అరోపణలతో వాగుతున్నారని.. ఒక్కసారి కూడా రుజువులతో మాట్లాడలేక పోయారని విమర్శించారు. 

చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్‌ను కాదని చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం ఉందన్నారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ కన్నా ఉత్తమ పరిపాలన తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలో అందిస్తున్నామని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పార్టీలు గత 75 ఏళ్లలో చేయని పనిని.. కేవలం తొమ్మిదేళ్లతో తాము చూపిస్తున్నామన్నారు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రులు టాయిలెట్స్, రైల్వే స్టేషన్లలోని లిఫ్ట్‌లు ప్రారంభిస్తున్నారని.. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని అన్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఈ సందర్భంగా చురకలు అంటించారు.

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్రాల ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఒకేసారి జీతం భారీగా పెంపు..!  

"తెలంగాణ రాష్ట్రం మైనార్టీలకు చేసిన కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన విషయం మర్చిపోవద్దు.. ఇక్కడ మాట్లాడింది నిజమా..? అక్కడ మాట్లాడింది నిజమా..? ఆయన తేల్చుకోవాలి.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ఆ పార్టీ ఇష్టం.. ప్రజలు మత ప్రాతికనే ఓట్లు వేస్తారని నేను నమ్మను. ఎంఐఎం కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌కు మాత్రమే మైనార్టీలు ఓట్లు వేస్తారన్నది కాకుండా ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని నమ్ముతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనే లేదు.. సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు హంగామా చేస్తుంటారు.

Also Read: Telangana- Andhra Super fast Railway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News