Sabitha Indra Reddy Warning to Officials: తెలంగాణ టెన్త్ పేపర్ల లీక్‌పై ప్రభుత్వం సీరియస్.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్

10th Exam Paper Leak in Telangana: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. అక్రమాలకు పాల్పడే ఉద్యోగాలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 6, 2023, 08:58 PM IST
Sabitha Indra Reddy Warning to Officials: తెలంగాణ టెన్త్ పేపర్ల లీక్‌పై ప్రభుత్వం సీరియస్.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్

Sabitha Indra Reddy Warning to Officials Over SSC Question Paper Leak: తెలంగాణ పదో తరగతి పేపర్లు ఎగ్జామ్ సెంటర్‌ నుంచి వాట్సాప్‌లో వైరల్ కావడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సోమవారం తెలుగు పేపర్ వాట్సాప్ గ్రూప్‌ల్లో ప్రత్యక్షం అవ్వగా.. మంగళవారం హిందీ పేపర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.  

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని.. ఈ విషయంలో  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని కోరారు. మిగిలిన నాలుగు పేపర్ల నిర్వహణలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ సెంటర్‌లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు.  

'పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో ఏ విధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలి. ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్‌ను పటిష్టంగా అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ షాపులను మూసివేయించాలి..' అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులను మంత్రి అభినందించారు.

వికారాబాద్ జిల్లా తాండూర్‌లో సోమవారం తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలెటర్‌ ఫొటో తీసి వాట్సాప్‌లో పంపించిన విషయం తెలిసిందే. మంగళవారం హిందీ పరీక్ష జరుగుతుండగా.. ఎగ్జామ్ ప్రారంభమైన వెంటనే వరంగల్ జిల్లాలో ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైంది. వరుసగా పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్

Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News