Munugode: ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా మాట్లాడినా ఖాతరు చేయకుండా టీఆర్ఎస్ ఎంపీపీ బీజేపీలో చేరారు. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి.. శామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ నివాసంలో కమలం పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ బీజేపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడూరి వెంకట్ రెడ్డితో పాటు చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ చౌటుప్పల్ మాజీ మండల అధ్యక్షుడు కంది లక్ష్మారెడ్డి, సీనియర్ నేత ఎడ్ల మహేందర్ రెడ్డి కమలం గూటికి చేరారు.
మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ లో అసమ్మతి వాయిస్ వినిపిస్తున్నారు ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఓపెన్ గానే డిమాండ్ చేశారు. దీంతో పార్టీ పెద్దలు తాడూరి వెంకట్ రెడ్డితో మాట్లాడారు. మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పలుసార్లు మాట్లాడి బుజ్జగించారు. అయినా వెనక్కి తగ్గలేదు తాడూరి వెంకట్ రెడ్డి.నియోజకవర్గంలోని కూసుకుంట్ల వ్యతిరేక నేతలను సమీకరించి చౌటుప్పల్ సమీపంలో సమావేశం నిర్వహించారు. కూసుకుంట్ల టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. ఈ సమావేశానికి దాదాపు 300 మంది నేతలు రావడంతో టీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయింది.
తాజాగా సోమవారం రాత్రి హైదరాబాద్ వనస్థలిపురం లో చౌటుప్పల్ MPP తాడూరి వెంకటరెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. తాడూరి వెంకట్ రెడ్డిపై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు చేశారు. అసమ్మతి గళం వినిపిస్తున్నందునే తాడూరిపై పాత కేసులు తిరగతోడారని అతని అనుచరులు ఆరోపించారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారన్న సమాచారంతోనే అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ మారుతున్న విషయం తెలుసుకుని పోలీసులతో తనను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని తాడురి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఈటల రాజేందర్ సమక్షంలో కమలం గూటికి చేరారు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి. త్వరలోనే మరికొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతారని ఆయన చెప్పడం కలకలం రేపుతోంది.
Read Also: Chinese Spy Ship: చైనా నౌక నిఘాలో భారత్ అణుకేంద్రాలు! హంబన్‌టొటలో యువాన్ వాంగ్.. మనకు గండమేనా?
Read Also: ఒకరు భారత్‌లో, మరొకరు పాకిస్తాన్‌లో.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు! హృదయాలను పిండేసే దృశ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook