India President Droupadi Murmu Telangana Schedule Today: శీతాకాల విడిది నిమిత్తం సోమవారం (డిసెంబర్ 26) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఐదు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి హకీంపేట వైమానిక కేంద్రంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో ఆమెను సత్కరించారు. రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటన నేపథ్యంలో నేటి (డిసెంబర్ 27) షెడ్యూల్ ఇదే..
నేటి షెడ్యూల్ ఇదే:
# ఉదయం 10.20 నుంచి 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం కానున్నారు.
# మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతో పాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశంలో మాట్లాడనున్నారు.
# 4.15 నుంచి 4.35 వరకు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)లో వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 28 షెడ్యూల్:
# ఉదయం 10.40-11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌ను వర్చువల్లు ప్రారంభిస్తారు.
# మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శన. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం. ప్రాజెక్ట్ శంకుస్థాపన
డిసెంబర్ 29 షెడ్యూల్:
# ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.
# సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన
డిసెంబర్ 30 షెడ్యూల్:
# ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం.
# సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం.
# మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్న రాష్ట్రపతి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.