మేడ్చల్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ వేదికపై ఆయన కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన చారిత్రక సభలో సోనియా తెలంగాణ ప్రజల మదిలో ఉన్న విషయాలను వివరించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధింపబడింది...తెలంగాణ ఏర్పాటులో సోనియా కీలక పాత్ర ఉందన్నారు. ఈ సందర్భంగా తాను చెప్పదల్చుకుంది ఏమిటంటే ..ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ రాక్షస పాలనకు చమరగీతం పాడబోతున్నాం. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ తో టీటీడీపీ, టీజేఎస్, వామపక్ష పార్టీలు జట్టు కట్టాయి.
మహాకూటమి విధానాల్లో తెలంగాణ విద్యార్ధులు, రైతులు, మహిళలు ఆంక్షలు కనిపిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు... ఆ బాధ్యత ఇక నుంచి మహాకూటమి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడింది...మహాకూటమి ఏర్పడితే వ్యక్తుల కోసం పనిచేయదు.. నాలుగు కోట్ల ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాహుల్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తాము పనిచేస్తామని.. విద్యార్ధుల భవిష్యత్తు కోసం పనిచేస్తామని..అలాగే ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంగా పనిచేస్తామని.. యావత్ తెలంగాణ ప్రజల కోసం పాలన చేస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.