Raj Pakala: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీ వ్యవహారంలో తాము ఎలాంటి అరెస్ట్‌లు చేయబోమని అదనపు ఏజీ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులో కేసులు పెట్టారని రాజ్ పాకాల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరగ్గా.. కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
విదేశీ మద్యం పరిమితికి మించి వినియోగించారనే కేసులో కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. అతడి తరఫున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకుంది. మొదట పిటిషనర్ రాజ్ పాకాల తరఫు న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే అతడిని నిందితుడిగా చేర్చారు' అని వివరించారు.
Also Read: Harish Rao: ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్ పార్టీ చెబుతారా..? బురద జల్లడమే రేవంత్ పని
'డ్రగ్స్ టెస్ట్‌కు నమూనాలు ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ బావమరిదిని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారు. రాజ్ పాకాలకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు నోటీస్ ఇచ్చి 11 గంటలకు విచారణకు రమ్మన్నారు. ఇది ఎలా?' అని న్యాయవాది మయూర్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
అరెస్ట్ చేయం..
కాగా ఈ అంశంపై ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపంచారు. 'మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. దీనిలో రాజకీయ ప్రమేయం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41ఏ నోటీసులు ఇచ్చాం. దర్యాప్తులో తీవ్ర నిర్ణయాలు ఏమీ తీసుకోమని కోర్టుకు తెలిపాం' అని అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు రాజ్ పాకాలను పోలీసులు ముందు హాజరు కావడానికి రెండు రోజుల సమయం ఇవ్వడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook