Lagacharla Collector Attack: సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి సంఘటనపై అక్కడి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లగచర్ల సంఘటనపై స్పందిస్తూ.. ఎంతటి వారినైనా ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దాడి ఘటనను ఖండిస్తూనే నిందితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారు ఎంతటివారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read: KTR Arrest: గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ అరెస్ట్ పక్కా: రేవంత్ రెడ్డి సంచలనం
ఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో చోటుచేసుకన్న పరిణామాలపై మంగళవారం పెదవి విప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. 'దాడులు చేసినా వారిని.. చేయించిన వారిని ఎవరినీ వదలం. ఇలాంటి దాడులు బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో జరిగితే సమర్ధిస్తారా? అధికారులపై దాడులను బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు ఖండించదు' అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. దాడులను ప్రోత్సహించేందుకు పరామర్శలు చేస్తారా? అని నిలదీశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటెయొద్దని కేటీఆర్ పిలుపునివ్వడంతో 'బీజేపీకి సహకరించినట్లే కదా?' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Vikarabad Collector: కలెక్టర్ దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన
గ్రామాల్లో ఉద్రిక్తత
కలెక్టర్‌పై దాడి ఉదంతంతో కొడంగల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. దాడి కేసులో 55 మందిని అదుపులోకి తీసుకోగా.. లగచర్ల, రోటిబండతండా, పులిచర్లతోపాటు మొత్తం 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫార్మా ంపెనీఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు పోరాటం చేస్తామని స్పష్టం చేశాస్తున్నారు. తమ జీవనోపాధి.. గ్రామాలు కలుషితం కాకుండా తాము ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని అక్కడి గ్రామస్తులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. దాడికి కారకులుగా భావిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులనే పోలీసులు లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారు. కాగా రైతులకు బేడీలు వేసుకుని పోలీస్ స్టేషన్‌తీసుకురావడం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి