T Fibre: తెలంగాణ ప్రజలకు బంపరాఫర్‌.. రూ.300కే ఇంటర్నెట్‌ సేవలు

Revanth Reddy Request To Union Govt Approval For T Fibre DPR: అధిక టారిఫ్‌లతో ఇబ్బందులు పడుతున్న ఇంటర్నెట్‌ వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.300కే ఇంటర్నెట్‌ అందిస్తామని ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 23, 2024, 09:21 PM IST
T Fibre: తెలంగాణ ప్రజలకు బంపరాఫర్‌.. రూ.300కే ఇంటర్నెట్‌ సేవలు

T Fibre Connection: ఇంటింటికి ఇంటర్నెంట్‌ అందించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో టీ ఫైబర్‌కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర టెలీకాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నెల‌కు రూ.300కే రాష్ట్రంలోని 93 ల‌క్ష‌ల గృహాల‌కు ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. టీ-ఫైబర్‌కు వడ్డీ రహిత రుణం రూ.1,779 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Maoist Radha: 'విరాట పర్వం' సీన్‌ రిపీట్.. కోవర్టుగా భావించి మహిళా మావోయిస్టు హత్య

 

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క, ఇతర మంత్రులు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించారు. రాష్ట్రం‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 ల‌క్ష‌ల గృహాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 30 ల‌క్ష‌ల గృహాల‌కు నెల‌కు రూ.300కే ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్ట‌కున్న‌ట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. టీ ఫైబ‌ర్‌తో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశ‌మ‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు. 

Also Read: KTR Assets: ఆస్తులపై కేటీఆర్‌ సంచలన ప్రకటన.. నాకెలాంటి ఫామ్‌హౌజ్‌ లేదు

 

ఆ ప్రాజెక్టులో భాగంగా 65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టూ సిటీజన్) కనెక్టివిటీ కల్పించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని గృహాలకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలనుకున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. 300 రైతు వేదికలకు, సాంఘిక సంక్షేమ పాఠశాలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్నట్లు వివరించారు.

టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ‌ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని.. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.1,779 కోట్లను యూఎస్ఎఫ్ఓ ద్వారా వ‌డ్డీ లేకుండా దీర్ఘ‌కాలిక రుణంగా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్ప‌న‌కు ఉద్ధేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ ఫైబర్ కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News