ఇవాళ రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ప్రగతి నివేదన సభ'ను నిర్వహిస్తోంది. సాయంత్రం మొదలయ్యే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తికాగా.. ఈ సభకు 25లక్షల మంది కార్యకర్తలు హాజరుకానున్నారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లలో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వేదికపై సీఎం కె.చంద్రశేఖర్ రావు, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు, మాజీ మంత్రులు కూర్చోనున్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ వద్ద ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీ ఒకటి సభకు వచ్చే వారందరినీ ఆకట్టుకొంటోంది. శ్రీరాముడి వేషధారణలో సీఎం కేసీఆర్ కనిపించే ఆ కటౌట్‌లో కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఫోటోలను ప్రదర్శించారు. ప్రగతి నివేదన సభకు స్వాగతం-సుస్వాగతం అని పలుకుతూ టీఆర్‌ఎస్ నాయకుడు తేరుపల్లి రమేష్ ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
ఈ బహిరంగ సభను ప్రజలు చాలా కాలంగుర్తు పెట్టుకుంటారని.. దీనిని దేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా అభివర్ణించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
Telangana Chief Minister Kalvakuntla Chandrashekar Rao depicted as Lord Rama in a Telangana Rashtra Samithi(TRS) poster in Ranga Reddy district, ahead of the party's Pragathi Nivedhana Sabha which will be held later today pic.twitter.com/Py8bd2TOgQ
— ANI (@ANI) September 2, 2018
The turnout in this rally is going to be something that people will remember for a long time, it is going to be the biggest political rally ever held in India: Telangana Minister K. T. Rama Rao on TRS's Pragathi Nivedhana Sabha in Ranga Reddy district later today pic.twitter.com/ErzZxJXD6D
— ANI (@ANI) September 2, 2018
#Visuals from Telangana Rashtra Samithi(TRS) rally venue in Ranga Reddy district, rally to be held later today and will addressed by CM Kalvakuntla Chandrashekar Rao. #Telangana pic.twitter.com/7FDYs297tX
— ANI (@ANI) September 2, 2018
అటు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు.