Presidential Election: రాష్ట్రపతి ఎన్నికలో తాను ఎలాంటి క్రాస్ ఓటింగ్ వేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. తనను బద్నాం చేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లావుగా మార్కర్ ఉండటంతో చేయి జారీ బ్యాలెట్ పేపర్‌పై మార్క్ పడిందన్నారు. ఇదే క్రమంలో అభ్యర్థుల పేర్లు ఉన్న దగ్గర మార్క్ పడలేదని తెలిపారు. తన ఓటు చెల్లదన్న ఉద్దేశంతోనే మరో బ్యాలెట్ పేపర్ అడిగానని తేల్చి చెప్పారు.
అధికారులు కుదరదని చెప్పడంతో అదే బ్యాలెట్‌లో ఓటు వేశానని వెల్లడించారు ఎమ్మెల్యే సీతక్క. పార్టీ ఆదేశాల మేరకే తన ఓటు వినియోగించుకున్నానని స్పష్టం చేశారు. తనకు కోవర్ట్ రాజకీయాలు రావని అన్నారు. అంతకముందు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పత్రంపై ఓటు వేసిన అనంతరం ఆమె అక్కడే ఉండిపోయారు.
ఈక్రమంలో హాల్‌లో ఉన్న అధికారులతో సీతక్క మంతనాలు జరిపారు. ఇది గమనించిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తరపు ఏజెంట్ మహేశ్వర్‌రెడ్డి..ఓటుపై అనుమానం ఉండే మరో బ్యాలెట్ పత్రం తీసుకోవాలని సూచించారు. దీంతో ఆమె మరో పత్రం ఇవ్వాలని అధికారులను కోరారు. దీనిపై హాల్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. చివరకు మళ్లీ ఓటు వేసేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క మొదట ఓటు వేసిన పత్రానే బాక్స్‌లో వేశారు.
Also read:Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్‌లో ముగిసిన ఓ ఘట్టం..వన్డేలకు గుడ్‌బై చెప్పిన స్టార్ ప్లేయర్..!
Also read:Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook