హైదరాబాద్: కరోనావైరస్ (Coronavirus) లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ (Telangana govt) ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై అనుమానితులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం తమ బ్లడ్ శాంపిల్స్ (Blood samples for COVID-19 test) ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకునే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ ఉంది. ప్రస్తుతం బ్లడ్ శాంపిల్స్ సేకరణ కోసం ఓ సంచార వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.
Also read : April salaries: ఏప్రిల్లోనూ సర్కార్ ఉద్యోగులకు వాయిదా పద్ధతే!
బ్లడ్ శాంపిల్ని పరీక్షా కేంద్రానికి తీసుకు వెళ్లే వరకు అవి క్షీణించిపోకుండా ఉండేందుకు అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలతో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో అధిక సంఖ్యలో కేసులు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్నందున, తొలుత ఇక్కడి నుంచే బ్లడ్ శాంపిల్ కలెక్షన్ వాహన సేవలు ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే... అనుమానితులు రోడ్డెక్కాల్సిన అవసరం లేకుండానే కోవిడ్ పరీక్షలు పూర్తవుతాయి. Also read : ఏపీకి రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు 982 కోట్లు
ఆ తర్వాత హోమ్ క్వారంటైన్:
ఇంటి వద్దకే వచ్చి రక్త నమూనాలు సేకరించిన తర్వాత కోవిడ్-29 టెస్ట్ రిపోర్ట్ వెలువడే వరకు అనుమానితులను వారి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించనున్నారు. అంతేకాకుండా ఒకవేళ అనుమానితులకు కరోనా వైరస్ సోకి ఉన్నట్టయితే... అది వారి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుంది కనుక.. అనుమానితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలు అందచేస్తుంది. ప్రస్తుతం చేపడుతున్న ఇంటింటి సర్వేలో 2,200 మందిని కరోనా లక్షణాలున్న అనుమానితులుగా గుర్తించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్కార్ ప్రకటించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..