హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల కోసం కోత్తగా 55 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల సృస్టించి, గ్రామాల్లో సత్వర న్యాయం కల్పించేందుకు గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 55 జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో త్వరలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రామ న్యాయాలయాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమావేశం ఆమోదం తెలపనుంది. ఈ మేరకు గ్రామ న్యాయాలయాల్లో భర్తీ చేయనున్న వారి జీతభత్యాలను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న, చిన్న వివాదాలు కోర్టుల వరకు రాకుండా స్థానికంగానే అక్కడికక్కడే న్యాయం లభించాలన్న లక్షంతో ప్రభుత్వం వీటిని నెలకొల్పుతోంది.
ప్రస్తుతం తెలంగాణలోని పలు గ్రామాల్లో న్యాయ పరిష్కారాల కోసం పెద్దఎత్తున సమయం వృధా అవుతోంది. ఫలితంగా గ్రామ ప్రజలకు వెంటనే న్యాయం లభించడం లేదు. కోర్టుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ న్యాయాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేసులకు సంబంధించిన ప్రతిసారి గ్రామస్తులు జిల్లా కోర్టులకు వెళ్ళాల్సి వస్తోంది. ఇది వారికి తీవ్ర స్థాయిలో ఆర్ధిక భారం కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో తొలివిడతగా 55 జూనియర్ పోస్టులను సృష్టించి వాటిని వెంటనే భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ న్యాయాలయాల్లో మొత్తం ఐదు కేటగిరిల్లో పోస్టులను భర్తీ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..