Telangana Health Director Srinivasa Rao: బీఆర్ఎస్‌ నుంచే రాజకీయాల్లోకి.. ఆ స్థానం నుంచే పోటీ: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు

Srinivasa Rao Political Entry: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే.. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే బరిలో నిలబడతానని స్పష్టం చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 10, 2023, 10:38 PM IST
Telangana Health Director Srinivasa Rao: బీఆర్ఎస్‌ నుంచే రాజకీయాల్లోకి.. ఆ స్థానం నుంచే పోటీ: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు

Srinivasa Rao Political Entry: రాజకీయ రంగ ప్రవేశంపై గత కొద్ది రోజులుగా హింట్ ఇస్తూ వస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. బీఆర్ఎస్‌ నుంచే తాను పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టారు. తాను ప్రత్యక్ష రాజకీయలలోకి తప్పకుండా వస్తానని.. అది కూడా సీఎం కేసీఆర్ అనుమతితోనేనని చెప్పారు. సీఎం కేసీఆర్ కొత్తగూడెం నుంచి పోటీ చేయమని అనుమతి ఇస్తేనే తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని అన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే పోటీ చేస్తానని. బీఆర్ఎస్ బీ ఫామ్  ఇవ్వకుంటే వేరే ఏ  పార్టీ  నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. 

తనకు ఇంకా ఏడేళ్ల ఉద్యోగ సర్వీస్ ఉందని.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగం చేసుకుంటానని అన్నారు. అదేవిధంగా జీఎస్ఆర్  ట్రస్ట్ సేవలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్  ఆదేశిస్తేవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు.

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరు గతంలో నుంచి వివాదస్పదంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా.. ఆయన కేసీఆర్ కాళ్ల మొక్కారు. శ్రీనివాసరావు వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు గతంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రవేశంపై వార్తలు వచ్చాయి. 

ఆ తరువాత ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం అయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసు క్రీస్తు కృప వల్లే కోవిడ్ నుంచి మనం అందరం విముక్తి అయ్యామంటూ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా కొత్తగూడెం నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని శ్రీనివాస రావు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ శ్రీనివాస రావుకు టికెట్ ఇస్తారో లేదో చూడాలి మరి.

Also Read: Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ క్లియర్‌గా నాటౌట్.. అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..?  

Also Read: Minister Harish Rao: మాటలు కోటలు దాటాయి.. చేతలు పకోడీ చేసినట్లు ఉంది: ఏపీ నేతలపై మంత్రి హరీష్ రావు సెటైర్లు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News