Telangana High Court: తెలంగాణలో విద్యాసంస్థల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన

Telangana High Court on Online Classes: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధనలను కొనసాగించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈ నెల 20న మరోసారి విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 02:54 PM IST
    • తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
    • ఫిబ్రవరి 20 వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశం
    • హైదరాబాద్ వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లలో కరోనా నిబంధనలు అమలుకు సూచన
Telangana High Court: తెలంగాణలో విద్యాసంస్థల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన

Telangana High Court on Online Classes: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వం అందజేసిన నివేదికల ఆధారంగా.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టని కారణంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలను ఓపెన్ చేయడం సహా ఆన్ లైన్ క్లాసులు కూడా కొనసాగించాలని సూచించింది. ఫిబ్రవరి 20 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

అదే విధంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల నియంత్రణలో భాగంగా మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించింది. 

రెండు వారాల్లో కరోనా పరిస్థితులపై మరో నివేదిక న్యాయస్థానానికి అందజేయాలని.. కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఫిబ్రవరి 20న మరోసారి విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివేదిక

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.40గా కరోనా పాజిటివిటీ రేటు ఉందని నివేదకలో పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని కోర్టుకు వివరించారు. 

మరోవైపు ఇంటింటికి జ్వరం సర్వే చేస్తూ.. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి మెడికల్ కిట్లు అందజేసామని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెలలో జరగనున్న సమక్క, సారలమ్మ జాతరకు కరోనా నిబంధనలను పాటించేలా ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు విన్నవించుకున్నారు.  

Also Read: KTR on Budget: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదు..

Also Read: Medaram Jatara Bus Timings: మేడారం జాతరకు స్పెషల్ బస్సులు.. ఏఏ సమయాల్లో అందుబాటులో ఉంటాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News