Telangana - Lok Sabha Elections 2024: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అంతేకాదు రాజకీయ పార్టీలు ఎత్తులు, పొత్తులతో ప్రత్యర్ధి పార్టీలపై పై చేయి సాధించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 సీట్లు గెలచి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తుందని చెప్పారు. అదే గనక జరిగితే.. తాను రాజకీయ సన్యాసం స్వకరిస్తానని సవాల్ చేశారు. ఆదిలాబాద్‌లో శనివారం పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి, శక్తి కేంద్రాల బాధ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైదారాబాద్‌లో రూ. 3 వేలకు కోట్లకు సంబంధించిన స్థలం లీజు విషయంలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. ముందుగా ఆ సంస్థను రద్దు చేసి.. తిరిగి అదే సంస్థకు లీజును అప్పజెప్పడంపై అక్రమాలు జరిగాయన్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.
తెలంగాణ లోక్‌సభకు ఎన్నికల విషయానికొస్తే.. ఈ నెల 18 ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడనుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ తర్వాత.. ఒక రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరగున్నాయి.దాదాపు ఈ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో తొలి దశ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఆ తర్వాతజూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ఈ క్రతువు ముగుస్తోంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter