Khaitalapur Bridge: హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. కైతలాపూర్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈనెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఫ్లైఓవర్ పనులన్నీ పూర్తైయ్యాయి. బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద దీనికి మరమ్మతులు చేశారు. వంతెన వల్ల కూకట్‌పల్లి, హైటెక్ సిటీ అనుసంధానం అవుతుంది. జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, సైబర్ టవర్ కూడలి వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది.
సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మాదాపూర్ ప్రధాన రహదారి, మూసాపేట్ మీదుగా కైతలాపూర్ వైపు మళ్లించనున్నారు. దీంతో 3.5 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణికులకు సుమారు గంట సమయం మిగులుతుంది. ఫ్లైఓవర్‌పై రహదారి పొడవు 675.50 మీటర్లు, వెడల్పు సుమారు 16.6 మీటర్లు ఉంది. కైతలాపూర్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి 5.5 మీటర్ల సర్వీస్ లైన్‌తో నిర్మించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లైఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే ఎస్‌ఆర్‌డీపీ చేపట్టిన పనులు ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువతున్నాయి. త్వరలో ఖైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారు.
WoW What a shot it is.
The Newly Constructed 3.50km flyover bridge.Road over Bridge at Kaithalapur would be opened to public on June 20 by Minister KTR garu & MLA Krishna Rao garu .link from KKP to Hitech City. pic.twitter.com/32lSb6ofVb— Naineni Abhilash Rao (@AbhilashTRS) June 10, 2022
Also read: Kishan Reddy on CM Kcr: కుటుంబం కోసమే జాతీయ పార్టీ..సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి