తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఉపఎన్నిక పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో భారీగా బందోబస్తు ఏర్పాటైంది.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మునుగోడు బరిలో మొత్తం 47 మంది అభ్యర్ధులు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855 కాగా పురుష ఓటర్లు 1,21,720 ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,20,128 ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 5,686 ఉన్నాయి. మునుగోడులో పోలింగ్ కోసం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 ఉన్నాయి. ఇక పోలింగ్ సిబ్బంది 1192 మంది కాగా, అదనంగా 263 మందిని నియమించారు. మరో 199 మంది మైక్రో అబ్జర్వర్లుగా రంగంలో ఉంటారు. వీరికితోడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 50 వరకూ ఉన్నాయి.
పోలింగ్ సిబ్బంది, కేంద్రాల ఏర్పాట్లు ఇలా ఉంటే..పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటైంది. ఏకంగా 2500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఇక కేంద్రం తరపున 15 పారా మిలిటరీ బలగాలున్నాయి. 35 సున్నితమైన ప్రాంతాల్ని పోలీసులు గుర్తించారు. సీసీ కెమేరా నిఘా నిరంతరం ఉంటుంది. చెక్ పోస్టులు పోలింగ్ ముగిసేవరకూ కొనసాగుతాయి.
Also read: Munugodu Polling: మరికొద్ది గంటల్లో మనుగోడు పోలింగ్, ఓటరు తీర్పు అర్ధమయ్యేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook