Hyd Traffic Restrictions: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు హైదరాబాద్‌లో ఏయే మార్గాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాఫిక్ మళ్లింపు ఎటువైపు ఉంటుందనే వివరాలన్ని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమీషనల్ విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు, పలు పార్టీలు అగ్రనేతలకు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఎల్బీ స్డేడియం పరిసరాల్లో రేపు మద్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి.
1. పబ్లిక్ గార్డెన్స్ ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపుకు వెళ్లే ట్రాఫిక్‌ను అనుమతించరు. నాంపల్లి, చాపెల్ రోడ్డు వైపుకు మళ్లిస్తారు.
2. ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపుకు అనుమతించకుండా చాపెల్ రోడ్డు వైపుకు మళ్లిస్తారు.
3. బషీర్ బాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపుకు అనుమతించకుండా బషీర్ బాఘ్ నుంచే కింగ్ కోఠి, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపుకు మళ్లిస్తారు.
4. సుజాతా స్కూల్ లైన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపుకు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి స్టేషన్ రోడ్ వైపుకు మళ్లిస్తారు.
రేపు మద్యాహ్నం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లు
పంజాగుట్ట, వివి స్టాట్యూ, రాజీవ్ గాంధీ స్టాట్యూ, నీరన్కారి, సైఫాబాద్ పాత పోలిస్ స్టేషన్, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్, బషీర్ బాగ్ , బీజేఆర్ స్టాట్యూ సర్కిల్, ఎస్బీఐ గన్ ఫౌండ్రీ, ఆబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కేఎల్కే బిల్డింగ్స్ , లిబర్టీ, హిమాయత్ నగర్, అసెంబ్లీ, మోజంజాహి మార్కెట్, హైదర్ గూడ
రవీంద్ర భారతి నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపుకు వెళ్లై ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్డేడియం మెయిన్ గేట్‌ను తప్పించుకుని పబ్లిక్ గార్డెన్స్ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డువైపుకు డైవర్ట్ కావాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook