బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కమలదళంలోకి ప్రముఖ దళిత నేత ?

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ దళిత నేతపై బీజేపీ కన్నేసింది

Last Updated : Aug 11, 2019, 12:13 PM IST
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కమలదళంలోకి ప్రముఖ దళిత నేత ?

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ఆపరేషన్ ఆకర్ష్, సామాజిక సమీకరణలపై ప్రధానంగా దృష్టి సారింది. ఈ క్రమంలో దళితులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ దళిత పై కన్నేసినట్లు తెలిసింది. ఇంతకీ ఎవరా నేత.. ఆసలు కథేంటి అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

ప్రభావం కోల్పోయిన దళిత నేత !!

నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన దళిత నేత మోత్కుపల్లి...  రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చారు.  దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీకి రాం రాం చెప్పిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే  మోత్కుపల్లి కాషాయం కండువా కప్పుకోనున్నారని వార్త తెగ హల్ చల్ చేస్తోంది.

దానికి కారణాలు లేకపోలేదు... 

టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత మోత్కుపల్లికి తన రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే... ఆయన ఏ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపలేదు. కారణం టీడీపీలో ఓ వెలుగు వెలిగిన తనకు.. ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి తనకు ఇలాంటి ప్రాధాన్యత ఇస్తామనే గ్యారెంటి ఇవ్వ లేదు. దీంతో ఆయన ఎటూ మొగ్గుచూపకుండా  సైలెంట్ అయిపోయారు. అయితే జనాల్లో అంతో ఇంతో పట్టున్న ఆయన తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు ముందున్న ఆప్షన్స్  బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది.

మోత్కుపల్లిపై కన్నేసిన కమలదళం 

సరిగ్గా ఇలాంటి తరుణంలో సామాజిక సమీకరణలపై దృష్టి సారించిన కమలం పార్టీ జనాల్లో పట్టున్న నేతలకు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గాలం వేస్తోంది. ఈ వ్యూహంలో గా భాగంగా  దళిత సామాజికవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లిపై కమలనాధులు కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు ఉంటడం..ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగలిగే సత్తా ఉన్న నేతగా ముద్రపడటం మోత్కపల్లికి ప్లస్ పాయింట్ గా మారాయి. పైగా దళిత వర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కారణాల రీత్యా కమలనాథులు మోత్కుపల్లికి కమలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

మోత్కుపల్లితో సంప్రదింపులు

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత నర్సింహులు పార్టీలో చేరితే తెలంగాణలో ప్లస్ అవుతుందని భావించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లను రంగంలోకి దింపు సంప్రదింపులు జరిపించినట్లు ...  ఈ సందర్భంగా మోత్కుపల్లి కూడా సానుకూలత వ్యక్తం చేశారనే వార్త తెగ హల్ చేస్తోంది. అయితే దీనిపై అటు మోత్కుపల్లి నుంచి కానీ..కమలం పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

Trending News