ప్రజాగాయకుడు గద్దర్ పొలిటికల్ ఎంట్రీ సీక్రేట్ ఇదే ...

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. అని తన గళంతో తెలంగాణ ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లిన ప్రజా గాయ‌కుడు గద్దర్‌. డిసెంబర్ లో జరగనున్న తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో గద్దర్ ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. 

Last Updated : Nov 13, 2018, 06:14 PM IST
ప్రజాగాయకుడు గద్దర్ పొలిటికల్ ఎంట్రీ సీక్రేట్ ఇదే ...

ప్రజాగాయకుడు గద్దర్.. గతంలో ఎప్పుడూ ఎన్నిక‌ల‌పై ఆసక్తి కరబర్చలేదు. ఎవరికీ మద్దతు తెలపలేదు..అలాగని ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించనూ లేదు. కానీ ఇప్పుడు మాత్రం తన పంథా మార్చుకున్నారు. ఆయన నోట రాజకీయాల మట వినిపిస్తోంది. అధికార టీఎస్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ఎంతోమంది తెలంగాణ అమరుల ప్రాణ త్యాగాలకు విలువ లేకుండాపోయిందనేది ఆయన బాధ. ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వారికి పదువులు కట్టబెడుతున్నారనేదే ఆయన ఆవేదన. మరోవైపు సామన్య ప్రజలను కాకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆగ్రహంతో ఉన్న గద్దర్.. ఒక్కసారిగా తన పోకడ..పంథాను మార్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు.  

పార్టీల ప్రతిపాదనలు తిరస్కరణ..
గద్దర్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వినిపించగానే ఆయనకు తామంటే తాము సీటు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు క్యూకట్టాయి. కోరుకున్న సీటు ఇస్తామని ఆఫర్లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా గజ్వేల్ సీటు ఇస్తామంటూ ముందుకు వచ్చి కేసీఆర్ పైనే పోటీ చేయమని ఆఫర్ ఇచ్చింది. అయితే గద్దర్ అన్ని పార్టీల ప్రతిపాదనలను తిరస్కరించారు. తాను స్వతంత్రంగా పోటీ చేస్తారని .. అది కూడా సీఎం కేసీఆర్ పై పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తన స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తే వారి మద్దతు తీసుకుంటానని ప్రకటించి తన రాజనీతిని ప్రదర్శించారు. ఫ్యూడలిస్టులు, ఇంపీరియలిస్టులు అనే రెండు వర్గాల మధ్యలోనే ఎన్నికల్లో పోటీ ఉంటుందనేది గద్దర్ అభిప్రాయం. 

గద్దర్ ప్రభావం ఎలా ఉంటుంది ?
తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి రక్తం చిందించడానికైనా వెనుకాడనని గద్దర్ ఎన్నోసార్లు చెబుతూనే ఉంటారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న ఆయన తన ప్రభావాన్ని ఎంత వరకు చూపిస్తారో వేచిచూడాల్సిందే. ఈ కొత్త పంథాతో ప్రజల మనస్సులో స్థానం ఏమాత్రం సంపాదించుకుంటారో మరి. ఇదిలా ఉండగా గద్దర్ రంగంలోని దిగుతుంటే పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ముఖ్యంగా కేసీఆర్ కు ఈ పరిణామం ఇబ్బంది కరంగా పరిగణించనుంది. గద్దర్ పోటీకి దిగితే తెలంగాణ సెంటిమెంట్ ఓట్లు చీలుతాయనేదే టీఆర్ఎస్ భయం. ఇదిలా ఉండగా కేసీఆర్ ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న మహాకూటమి అవసరమైతే ఎన్నికల నాటి పరిస్థితి బట్టి అంతర్గతంగా గద్దర్ కు మద్దతు తెలిపే అవకాశముందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Trending News