TS EAMCET Results 2023: విద్యార్థులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 09.55 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్ష ఫలితాలను ప్రకటించారు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్ జూబ్లీ హాల్లో ఈ ఫలితాల విడుదలను మంత్రి విడుదల చేశారు. ఎంసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌తో పాటు ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను జీ తెలుగు న్యూస్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక మీ రిజల్ట్స్‌ను తెలుసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించాలసి ఉంటుంది.
ఈ సంవత్సరం ఎంసెట్(EAMCET) ఎగ్జామ్స్ మొత్తం 94.11 శాతం అభ్యర్థులు హాజరు కాగా మొత్తం 3,20,683 దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,01,789 మంది విద్యార్థలు ఎగ్జామ్స్ రాసినట్లు అధికారు వెల్లడించారు. ఈ విద్యార్థుల్లో కేవలం తెలంగాణ నుంచి 2,48,279 పరీక్షకు అప్లై చేసి 2,35,918 మంది విద్యార్థులు మాత్రం పరీక్షకు హాజరయ్యారని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ ఎంసెట్(EAMCET)లో ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేయగా..ఇందులో 65,871 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాశారు.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
పూర్తీ వివరాలు:
- ✺ జూన్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్.
- ✺ ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత.
- ✺ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86 శాతం ఉత్తీర్ణత.
- ✺ ఇంజనీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై.
- ✺ అగ్రికల్చర్లో బాలురు 84శాతం, బాలికలు 87 శాతం ఉత్తీర్ణత.
ర్యాంకుల వారిగా వివరాలు:
- ✵ ఇంజనీరింగ్‌లో అనిరుధ్‌కు మొదటి ర్యాంకు.
- ✵ ఇంజనీరింగ్‌లో మణిందర్‌రెడ్డికి ద్వితీయ ర్యాంకు.
- ✵ మెడిసిన్‌లో బూరుగుపల్లి సత్యకు మొదటి ర్యాంకు.
- ✵ మెడిసిన్‌లో ఎన్.వెంకట్‌కు ద్వితీయ ర్యాంకు.
ఇలా సులభంగా ఫలితాలను చెక్ చేసుకోండి:
స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in/ను సందర్శించాల్సి ఉంటుంది.
స్టెప్ 2: మీరు పై వెబ్సైట్ ఓపెన్ చేయగానే హోమ్ పేజీ వస్తుంది.
స్టెప్ 3: ఇలా హోమ్ పేజీలోనే పక్కన లేటెస్ట్ అప్డేట్స్ అని ఓ మీని బార్ కనిపిస్తుంది.
స్టెప్ 4: ఈ మీని బార్లో ఎంసెట్ ఫలితాలు అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 5: ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు నేరుగా ఎగ్జామ్స్ రిజల్ట్స్ సంబంధించిన పేజీలోకి వెళ్తుంది.
స్టెప్ 6: ఈ పేజీలో మీరు హాల్ టికెట్ నంబర్‌తో పాటు ఇతర సమాచారాన్ని ఫల్ చేసి సబ్మిట్ చేస్తే ఫలితాలు నేరుగా పొందొచ్చు.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook