Secretariat Fire Accident: కొత్త సచివాలయం అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్.. కారణం అదేనా..?

Telangana New Secretariat Fire Incident: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై అన్ని వైపులా నుంచి విమర్శలు వస్తున్నాయి. హడావుడిగా పనులు చేస్తుండడంతోనే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 01:54 PM IST
Secretariat Fire Accident: కొత్త సచివాలయం అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్.. కారణం అదేనా..?

Telangana New Secretariat Fire Incident: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. ప్రారంభానికి ముందే అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే తాజాగా ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఇది అగ్నిప్రమాదం కాదని.. మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారని, అందులో భాగంగా మంటలు వచ్చాయంటున్నారు. 

ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 5, 6వ అంతస్తుల్లో మాక్ డ్రిల్ జరిపినట్లు చెబుతుండగా.. మాక్ డ్రిల్ నిర్వహిస్తే భారీ మంటలు ఎలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లోర్లకు ఎందుకు వ్యాపిస్తాయని అంటున్నారు. అగ్నిప్రమాద ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వుడ్ వర్క్ జరుగుతుండగా మంటలు వ్యాపించాయని.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. భారీగా మంటలు వ్యాపించడంతో వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 11 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో సచివాయం వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్‌ను అధికారులు క్లోజ్ చేశారు. మీడియాను కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భగా కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. అయితే హడావుడిగా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడంతోనే ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. 'కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేయడం తప్పు. కేసీఆర్ జన్మదినం రోజే ప్రారంభించాలన్న ఒత్తిడితో ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఆయన జన్మదినం రోజు ప్రారంభించడానికి ఇదేమైనా రాచరికమా..? అగ్నిప్రమాదంపై నిజనిర్ధారణకు అఖిలపక్ష బృందాన్ని అనుమతించాలి..' అని డిమాండ్ చేశారు. హడావుడిగా నాణ్యత లేకుండా పనులు చేయిస్తుండటంతోనే కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  ఆరోపించారు. డా బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున సచివాలయం ప్రారంభించాలన్నారు.

Also Read:  Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది  

Also Read: Amul Milk Price Hike: అమూల్ పాల ధర రూ.3 పెంపు.. కొత్త ధరలు ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News