ALL IN ONE NEWS: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూస్తే.. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రథమ స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు.పాడి రైతులకు నష్టం కలిగించేలా పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెదవేగి మండలం దుగ్గిరాలలోని మోడల్ డైయిరీ పాల కేంద్రం వద్ద పాడి రైతులు ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత కట్ట గురవరెడ్డి ప్రజల వద్ద 3 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి పరారీ అయ్యాడు.