CV Anand Warning: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇకపై రోడ్లపై రయ్యిన దూసుకెళ్లినా.. అనవసరంగా హారన్ మోగించినా ఇకపై కఠిన చర్యలు ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనవసరంగా హారన్ మోగించకూడదని.. ఇష్టారాజ్యంగా రోడ్లపై ఆక్రమణలు చేసినా.. వాహనాలు ఎలా పడితే అలా నడిపితే ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇది చదవండి: Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌కు దిగ్గజ సంస్థతో వెయ్యి ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు ఆపరేషన్ రోప్ కార్యక్రమం చేపట్టారు. ఫుట్‌పాత్ ఆక్రమించిన దుకాణాలు.. తోపుడు బండ్లను తొలగించారు. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. 'పోలీస్ శాఖలో ట్రాఫిక్ పోలీసులు అత్యంత కీలకం. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోతే నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అని తెలిపారు.
ఇది చదవండి: Shailaja Died: విద్యార్థి శైలజ మృతి.. ఎంతమంది చస్తే రేవంత్ రెడ్డి నీ గుండెకరుగుతుంది?
'హైదరాబాద్ నగరంలో వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుందని.. వాటికి సరిపడా రోడ్లు విస్తరించాయి, ఫ్లై ఓవర్స్ నిర్మాణమయ్యాయి' అని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆశించిన మేరకు రోడ్లు మాత్రం విస్తరించలేదని పేర్కొన్నారు. నాయకులు.. ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 'ఫుట్‌పాత్‌లు చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయి. చిరు వ్యాపారాలు, తోపుడుబండ్లు మేము పేదవాళ్లు ఉన్నారు. మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటే కొంత మంది అడ్డు పడుతున్నారు' అని వివరించారు.
'జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్నారు. ఇదంతా హైదరాబాద్ నగరంలో మాఫియాలా తయారైంది' అని కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బస్సులు బస్‌స్టాప్ లోపల వెళ్లడం లేదు. బస్ బేస్ ఏర్పాటు చేయాలి' అని పేర్కొన్నారు. వీఐపీల రాకపోకలు పెద్ద సమస్య మారిందని చెప్పారు. 'ముఖ్యమంత్రి, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాత్రమే గ్రీన్ ఛానల్ ఉంటుంది' అని స్పష్టం చేశారు.
'హైదరాబాద్‌లో అనవసరంగా సైరన్స్ హారన్ మోగిస్తున్నారు. అనవసరంగా హారన్ మోగించకూడదని హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. ఇటీవల వాహనదారులకు అవగాహన కల్పించమని నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హారన్ సైరన్‌లను సీజ్ చేసినట్లు గుర్తుచేశారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక శాఖ మాత్రమే హారన్ సైరన్ మోగిస్తుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి