Minister Jagadish Reddy slams BJP Govt over disturbances in Telangana. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.