Lassa fever : మార్కెట్లోకి మరో ప్రాణాంతక వ్యాధి... యూకేలో 'లస్సా ఫీవర్‌'తో ముగ్గురు మృతి!

Lassa fever : యూకేలో లస్సా ఫీవర్ తో ముగ్గురు మృతి చెందారు. అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? చికిత్స విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 08:41 PM IST
Lassa fever : మార్కెట్లోకి మరో ప్రాణాంతక వ్యాధి... యూకేలో 'లస్సా ఫీవర్‌'తో ముగ్గురు మృతి!

Lassa fever : ఓ పక్క కరోనా వైరస్ తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే.. తాజాగా మరో ప్రాణాంతక వ్యాధి మానవాళిని భయపెడుతోంది. అదే లస్సా ఫీవర్ (Lassa fever). ఈ జ్వరంతో యూకేలో (United Kingdom) ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చివరిగా యూకేలో 2009లో రెండు లస్సా కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, ఇది జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ లస్సా వైరస్ అరేనావైరస్ కుటుంబానికి చెందినది. పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎలుకల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. 

తొలిసారి ఎప్పుడంటే...
లస్సా వైరస్‌ తొలిసారి 1969లో నైజీరియాలోని ( Nigeria) లస్సా’నే అనే ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ సాధారణంగా ఎలుకల నుంచి మనుషులకు సోకుతుంది. అదే విధంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. లస్సా జ్వరం ఇంక్యుబేషన్ పీరియడ్  2 నుంచి 21 రోజులు.

లస్సా ఫీవర్ లక్షణాలు..
డబ్యూహెచ్వో (WHO) ప్రకారం, ఈ వ్యాధి సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదు. కొద్ది మందిలో మాత్రం జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పి, ఛాతీ నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, దగ్గు, కడుపు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు ఉంటున్నాయి. ఈ వైరస్ సోకితే రక్త స్రావం జరుగుతోంది. తీవ్ర లక్షణాలు ఉంటే 14 రోజుల్లో మరణించే అవకాశం ఉంది.

చికిత్స విధానం..
ఇతర జ్వరాల నుంచి లస్సా ఫీవర్ ను గుర్తించడం చాలా కష్టమంటున్నారు నిపుణులు. లస్సా ఫీవర్ సోకితే.. రిబావిరిన్ అనే యాంటీవైరల్ డ్రగ్ ఇస్తారు. వ్యాధి ప్రారంభంలో ఉంటే ఈ డ్రగ్ అద్భుతంగా పనిచేస్తుందని సీడీసీ తెలిపింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News