ఫేస్‌బుక్: 'హ్యాకింగ్ బారిన 3 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’

ఫేస్‌బుక్: 'హ్యాకింగ్ బారిన 3 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’

Last Updated : Oct 13, 2018, 09:07 AM IST
ఫేస్‌బుక్: 'హ్యాకింగ్ బారిన 3 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. సుమారు 3 కోట్ల మంది యూజర్ల ఖాతాలను హ్యాకర్లు దొంగలించారని శుక్రవారం  తెలిపింది. వాస్తవానికి రెండు వారాల క్రితం ఫేస్‌బుక్‌లోని ఓ లోపాన్ని ఆయుధంగా చేసుకొని హ్యాకర్లు ఏకంగా 5 కోట్ల ఖాతాల వివరాలను దొంగలించారని ఫేస్‌బుక్‌ అంచనా వేసింది. అయితే లీకైంది సుమారు 3 కోట్ల డేటానే అని చెప్పింది.

 హ్యాకర్లు 29 మిలియన్ల ఖాతాల నుంచి పేర్లు, ఈమెయిల్ చిరునామాలను లేదా ఫోన్ నంబర్లను దొంగలించి ఉంటారని ఫేస్‌బుక్ సంస్థ పేర్కొంది. ఆ ఖాతాల్లో 14 మిలియన్ల మంది ఖాతాదారులకు సంబంధించి మరింత వ్యక్తిగత వివరాలైన జన్మస్థలం, పుట్టిన తేదీ, ఇటీవలే చెక్‌–ఇన్‌ అయిన 10 ప్రదేశాలు, ఇటీవలే ఏఏ అంశాలను వారు శోధించారు వంటి డేటాను కూడా సేకరించారని ఫేస్‌బుక్‌ తెలిపింది. దీని ద్వారా 10 లక్షల మంది ఖాతాలు కూడా ప్రభావితమయ్యాయని, అయితే హ్యాకర్లు ఆ అకౌంట్‌ల నుండి ఎటువంటి సమాచారం పొందలేదంది.

హ్యాకింగ్ బారినపడ్డ అకౌంట్‌లకు మెసేజ్‌‌లను పంపిస్తామని పేస్‌బుక్ తెలిపింది.  

థర్డ్ పార్టీ యాప్‌లు, ఫేస్‌బుక్ యాప్‌లు- ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు హ్యాకింగ్ బారిన పడలేదని సంస్థ తెలిపింది.  

ప్రస్తుతం 'ఫేస్‌బుక్ భద్రతా ఉల్లంఘన'ను ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని కంపెనీ తెలిపింది.

రెండు వారాల క్రితం 5 కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందంటూ వార్తలు వచ్చినప్పుడు.. కంపెనీ అధికారులు దాడుల వెనుక ఎవరు ఉన్నారో లేదా వారు ఎక్కడ ఆధారపడతారో తెలియదని చెప్పారు.

ఒకసారి ఖాతాలోకి లాగిన్‌ అయ్యాక లాగౌట్‌ చేసి, మళ్లీ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయకుండానే పాత వివరాలతో ఖాతాను తెరవడానికి ఉపయోగపడే ‘యాక్సెస్‌ టోకెన్ల’ను దొంగిలించడమే ధ్యేయంగా గత నెలలో సైబర్‌దాడులు జరిగాయని కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ 3 కోట్ల మంది సమాచారాన్ని దుర్వినియోగం చేశారా?లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

కొంతకాలంగా హ్యాకర్లు ఫేస్‌బుక్‌పై దాడులకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని కట్టడిచేసేందుకు యత్నిస్తున్నామని ఫేస్‌బుక్‌ తెలిపింది.

 

Trending News