CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!

CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్‌ విదేశీ టూర్‌ కొనసాగుతోంది. దావోస్‌లో రెండోరోజు బిజీబిజీగా గడుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 06:25 PM IST
  • దావోస్‌లో సీఎం జగన్
  • పెట్టుబడులే లక్ష్యంగా టూర్
  • పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ
CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!

CM Jagan Tour: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్‌ విదేశీ టూర్‌ కొనసాగుతోంది. దావోస్‌లో రెండోరోజు బిజీబిజీగా గడుపుతున్నారు. అక్కడ ఏర్పాటు చేసి ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నానితో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో సింగిల్‌ విండోలో అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. 

సీఎం జగన్‌తో భేటీ అనంతరం టెక్‌ మహీంద్రా సీఈవో, ఎండీ గుర్నాని మాట్లాడారు. విశాఖకు మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో  ఉన్నారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడుల పెట్టాలని కోరారని తెలిపారు. ఏపీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారన్నారు. సీఎం జగన్ కోరిక మేరకు ఆంధ్రా వర్సిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. నెపుణ్యాలను పెంచేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో వర్సిటీతో కలిసి పనిచేస్తామన్నారు. ఆంధ్రా వర్సిటీతో కలిసి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

అంతకముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో  ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై ఆయన మాట్లాడారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్ సెషన్‌లో సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో కరోనా సమయంలో తీసుకున్న చర్యలను వివరించారు. వైద్య వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం గురించి తెలియజేశారు. 

ఏపీలో పరిస్థితులను బట్టి కరోనా నియంత్రణను కార్యాచరణ రూపొందించామన్నారు. 44 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకుని ఇంటింటి సర్వే చేశామని వెల్లడించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ సేవలందరించారని చెప్పారు. వీరితోపాటు 42 వేల మంది ఆశావర్కర్లు పనిచేశారన్నారు. ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలను గుర్తించి..వారికి తగు జాగ్రత్తలు తీసుకునేలా చూశారన్నారు సీఎం జగన్. ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కరోనా మరణాల రేటులో రాష్ట్రం దేశంలోనే అత్యల్పంగా నమోదు అయ్యిందని గుర్తు చేశారు. 

ఫ్యామిలీ డాక్టర్ తరహాలో వైద్యులను తీసుకురాబోతున్నామని డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్ సెషన్‌లో వెల్లడించారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కేర్ సిస్టమ్‌ను సిద్ధం చేశామన్నారు. ప్రతి రెండు వేల జనాభా కలిగిన ఊరులో విలేజ్ క్లీనిక్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి 13 వేల జనాభాను మండల యూనిట్‌గా తీసుకుని..ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆస్పత్రుల్లో ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చెప్పారు. పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయని తెలిపారు. 

పీహెచ్‌సీలో ఉన్న డాక్టర్‌ బాధ్యతగా కొన్ని గ్రామాలకు వెళ్లి వైద్యం చేస్తారన్నారు. వీరంతా గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లలుగా సేవలందిస్తున్నారని సీఎం జగన్ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి పార్లమెంట్‌ను యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ కళాశాలలు రాబోతున్నాయని తెలిపారు. వీరంతా హెల్త్ కేర్‌ భాగమవుతారన్నారు సీఎం. రాబోయే మూడేళ్లలో వైద్య రంగానికి మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. మొత్తం 2 వేల 446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్స అందుతుందని చెప్పారు.

 

Also read:Fenugreek Seeds Benefits: పురుషుల్లో సంతానప్రాప్తిని పెంచే దివ్యఔషధం!

Also read:IPL 2022 Sixes: ఐపీఎల్‌లో సిక్సర్ల మోత..1000వ సిక్సర్‌ ఎవరు కొట్టారంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News