Press Freedom Index Rank: ఇండియాలో మీడియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?

2023 సంవత్సరానికి గాను వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్ వారు విడుదల చేసిన ఒక జాబితాలో భారత దేశానికి 161వ ర్యాంక్ ఇచ్చారు. కిందటి సంవత్సరంతో పోలిస్తే 11 స్థానాలు దిగజారి 161వ స్థానానికి చేరింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 05:44 PM IST
Press Freedom Index Rank: ఇండియాలో మీడియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..?

India's Press Freedom Index Rank: భారత దేశంలో మీడియా సంస్థలకు ఉన్న స్వేచ్ఛ ఏపాటిదో మరోసారి క్లారిటీ వచ్చింది. అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్ వారు 2023 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఒక జాబితాలో మీడియాకు ఏ దేశం ఎంత వరకు స్వచ్ఛను ఇస్తుంది అనేది పేర్కొనడం జరిగింది. మొత్తం 180 దేశాలకు సదరు సంస్థ ర్యాంకులను కేటాయించింది. 

ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ మీడియా స్వేచ్ఛ విషయంలో దేశాలకు రేటింగ్ లను ఇస్తూ వస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇండియా లో మీడియా స్వేచ్ఛ మరింతగా తగ్గిందని జాబితా చూస్తూ అర్థం అవుతుంది. 11 స్థానాలకు దిగజారింది. ఇండియాలో మీడియా పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉంటుందా అనుకునేంతగా రేటింగ్‌ నమోదు అవ్వడం అంతర్జాతీయంగా భారత పరువు పోయేలా ఉందంటూ కొన్ని మీడియా సంస్థల అధినేతలు మరియు సీనియర్ జర్నలిస్ట్‌ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం 180 దేశాల జాబితాను విడుదల చేసిన వరల్డ్‌ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 లో భారత్ 161వ స్థానంకి పరిమితం అయ్యింది. గత ఏడాది లో 150వ స్థానంలో ఉన్న ఇండియా 11 స్థానాలు దిగజారింది. ఏడాదిలో మీడియా పై మరింతగా ఆంక్షలు పెరిగినట్లుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 

మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్న చివరి దేశాల జాబితాలో ఇండియా చేరడం దారుణం. రాజకీయ నేతలకు స్నేహంగా ఉండే వ్యక్తులు మీడియా సంస్థలను కొనుగోలు చేసి.. వాటి స్వేచ్చను హరిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది. రాజకీయాలకు మీడియాతో సంబంధం ఉంటే సదరు మీడియాకు స్వేచ్ఛ ఉండదని సీనియర్ జర్నలిస్ట్ లు విమర్శిస్తూ ఉంటారు. ఈ జాబితా అదే విషయాన్ని క్లారిటీ తేల్చింది. 

Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ ఫైట్.. జరిమానా ఎవరు చెల్లిస్తారంటే..?  

మీడియా స్వేచ్ఛ విషయంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న దేశాలుగా టర్కీ.. తజకిస్తాన్‌ లు ఉన్నాయి. ఉగ్రవాద దేశాలతో పాటు వెనుకబడి ఉన్న దేశాల్లో మీడియా స్వేచ్ఛ విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇండియాలో మీడియా స్వేచ్ఛ మరింతగా దిగజారడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

ఇండియన్‌ ఉమెన్స్ ప్రెస్‌ కార్ప్స్‌ మరియు ప్రెస్ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్ అసోషియేషన్‌ సభ్యులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛ ఇంత దారుణంగా ఉండటం ను పలు దేశాలు కూడా నమ్మలేక పోతున్నారు. ఇండియాలో మీడియా పై ఇంతగా ఆంక్షలకు కారణం ఏమై ఉంటుంది అంటూ అంతర్జాతీయ సమాజంలో చర్చ మొదలైంది. ముందు ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనేది చూడాలి.

Also Read: Ugram Movie: అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. లాభం రావాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News