France New PM: ఫ్రాన్స్ కొత్త ప్రధాని గాబ్రియేల్ అట్టల్ రెండు అరుదైన రికార్డులు నెలకొల్పారు. అత్యంత చిన్న వయస్సులోనే ఫ్రాన్స్ ప్రధాని కావడం ఒకటైతే, తొలి స్వలింగ సంపర్కుడు దేశ ప్రధాని కావడం మరో విశేషం. త్వరలో జరగనున్న యూరోపియన్ ఎన్నికల ముందు ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫ్రాన్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఫ్రాన్స్ కొత్త ప్రదానిగా 34 ఏళ్ల గాబ్లియేల్ అట్టల్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నియమించారు. ఫ్రాన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా, విద్యా శాఖ మంత్రిగా సేవలందించిన గాబ్రియేల్ ఇప్పుుడు ఏకంగా దేశ ప్రధాని అయ్యారు. ఫ్రాన్స్ దేశ చరిత్రలో అత్యంత చిన్న వయస్సులో ప్రధాని కావడం, తొలి గే ప్రధాని కావడం విశేషం. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం విదేశీయుల్ని వెనక్కి పంపించే అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. తనను తాను స్వలింగ సంపర్కుడినని గాబ్రియేల్ అట్టల్ బహిరంగంగా ప్రకటించుకోవవడం గమనార్హం.
కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వ ప్రతినిదిగా పనిచేసిన గాబ్రియేల్ అట్టల్..ఫ్రాన్స్ రాజకీయాల్లో కీలకవ్యక్తిగా పరిణమించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు సలహాదారుడిగా ఉన్నారు. 1989 మార్చ్ 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్‌లో జన్మించిన గాబ్రియేల్ అట్టల్..యూదు కుటుంబానికి చెందిన న్యాయవాది. తండ్రి ఓ చిత్ర నిర్మాత. 2006లో సోషలిస్ట్ పార్టీలో చేరికతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2018లో ఇమ్మాన్యుయేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మాన్యుయేల్ మాజీ సలహాదారుడు స్టెఫాన్ సెజోర్న్‌తో సంబంధం పెట్టుకుని చర్చల్లో నిలిచారు. గాబ్రియేల్ మాజీ స్నేహితుడు కూడా అతడొక గే అనే విషయాన్ని వెల్లడించాడు.
Also read: AP Fake Votes: ఏపీలో భారీగా దొంగ ఓట్లు, 5.64 లక్షల ఓట్లు తొలగింపు, అధికారులపై వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook