Covid Virus Spread: ఆ రెండు వ్యాక్సిన్‌లలో ఒక్క డోసు పడినా చాలు..సంక్రమణ తగ్గుతోంది

Covid Virus Spread: దేశమంతా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆ రెండు కంపెనీల వ్యాక్సిన్‌ల గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఒక్క డోసు వ్యాక్సిన్‌తోనే సంక్రమణను చాలా వరకూ నియంత్రిస్తున్నాయని తెలుస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2021, 03:29 PM IST
Covid Virus Spread: ఆ రెండు వ్యాక్సిన్‌లలో ఒక్క డోసు పడినా చాలు..సంక్రమణ తగ్గుతోంది

Covid Virus Spread: దేశమంతా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆ రెండు కంపెనీల వ్యాక్సిన్‌ల గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఒక్క డోసు వ్యాక్సిన్‌తోనే సంక్రమణను చాలా వరకూ నియంత్రిస్తున్నాయని తెలుస్తోంది. 

దేశంలో కరోనా వైరస్ మహహమ్మారి(Corona virus)శరవేగంగా విస్తరిస్తోంది. ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తున్న సమయంలో రెండు కంపెనీల వ్యాక్సిన్‌ల గురించి ఆసక్తికరమైన, ముఖ్యమైన విషయాలు వెలుగు చూశాయి. ఫైజర్( Pfizer), ఆస్ట్రాజెనెకా ( Astrazeneca) కంపెనీ వ్యాక్సిన్‌లు పాజిటివ్ రోగుల్నించి సంక్రమణను ( Covid spread) కూడా నియంత్రిస్తున్నాయని తెలిసింది. కరోనా పాజిటివ్ రోగులు ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా కంపెనీ వ్యాక్సిన్ ఒక్కడోసు వేయించుకుంటే వారి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోందని తేలింది. దాదాపు 50 శాతం వరకూ ఈ రెండు వ్యాక్సిన్‌లు వైరస్ వ్యాప్తిని నిరోధిస్తున్నాయని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ రీసెర్చ్ జర్నల్‌లో కధనం ప్రచురితమైంది.

ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ( Pfizer and Astrazeneca vaccine) గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా పాజిటివ్‌ ( Corona patients) బాధితులు ఒక్క డోస్‌ ఫైజర్‌ (Pfizer) లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ వేయించుకుంటే వారినుంచి ఇతర కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని తేలింది. దాదాపు 50 శాతం వరకు ఈ రెండు వ్యాక్సిన్లు వైరస్‌ వ్యాప్తిని నిరోధిస్తాయని ది పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఫైజర్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లలో ఏదైనా ఒక్కడోసు వ్యాక్సిన్ ( Vaccination) వేయించుకున్నవారు మూడు వారాల తరువాత కోవిడ్ బారిన పడితే..వారి నుంచి ఇతరులకు వైరస్ సంక్రమణ (Coronavirus Spread) 38-49 శాతం తక్కువగా ఉన్నట్టు పీహెచ్ఈ రీసెర్చ్ సైంటిస్టులు వెల్లడించారు.

నిజంగానే ఇదొక అద్బుతం..ఇప్పటికే మేం చేసిన పరిశోధనల్లో వ్యాక్సిన్ ప్రాణాల్ని కాపాడుతుందని గుర్తించాం. ఇప్పుడు తాజా పరిశోధనల్లో వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని నిరూపితమైందని బ్రిటీష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న 57 వేల మందికి చెందిన 27 వేల కుటుంబాల ఆరోగ్య స్థితిగతులు, సంబంధిత డేటా ఆధారంగా పరిశోధన జరిగింది.

Also read: COVID-19 Cases: భారత్ నుంచి విమానాల రాకపోకలు నిషేధించిన ఆస్ట్రేలియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News