International Nurses Day 2023: కరోనా కాలంలో నర్సులు ఎంత కష్టపడ్డారో అందిరికీ తెలిసిందే.. వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి కోవిడ్ బారిన పడ్డవారిని మృత్యువు నుంచి తప్పించి కరోనా వారియర్‌లుగా నిలిచారు. ఆ సమయంలో వైద్యులతో పాటు నర్సులు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు సేవలందించారు. రోగులకు వ్యాధి నుంచి ఉపశమనం కలిగించేందుకు డాక్టర్స్ ఎంత కృషి చేస్తున్నారో నర్సులు కూడా అంతే కృషి చేస్తారు. నర్సులు రోగుల పట్ల చేసే సేవలు వర్ణణాతీతం.. కాబట్టి ప్రతి సంవత్సరం వారి గుర్తించుకుంటూ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం థీమ్ ఏమిటో?, ప్రాముఖ్యత ఎంటో మన ఇప్పుడు తెలుసుకుందాం.
నర్సుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం మే 12న నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మొదటి ఈ దినోత్సవాన్ని జనవరి 1974న జరుపుకునేవారు.. ఆ తర్వాత మేలో నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?
మే 12న మాత్రమే నర్సుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?:
నర్సింగ్ వ్యవస్థను స్థాపించిన ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు నర్సుల దినోత్సవం అంకితం చేస్తూ.. ప్రతి సంవత్సరం మే 12న నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ మే 12న జన్మించింది. అంతేకాకుండా ఇదే తేదినా నోబెల్ నర్సింగ్ సర్వీస్ కూడా ప్రారంభించింది.
మొదట వేడుకలు అక్కడే ప్రారంభమయ్యాయి:
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు సంస్థ 1974లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. నర్సులు చేస్తున్న సేవలను గురించి ఈ సంస్థ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంతర్జాతీయ నర్సుల కౌన్సిల్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌ను విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం నర్సుల దినోత్సవం థీమ్ 'మా నర్సులు, మన భవిష్యత్తు' అని పేర్కొంది. భవిష్యత్‌కు నర్సులు చాలా అవసరమని, మరిన్ని సేవలు అందించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సులు సంస్థ సూచించింది.
Also Read: May Grah Gochar 2023: రాబోయే 18 రోజుల్లో ఈ రాశులవారు ధనవంతులవ్వడం పక్కా.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook