ISCON Temple Vandalised: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ రాధాకాంత దేవాలయం ధ్వంసానికి గురైంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తుల సమూహం వచ్చి గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆలయంపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం.. దాదాపుగా 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించి.. ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా ఆలయంలోని విలువైన సంపదను దోచుకున్నట్లు వారు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎంతమంది గాయపడ్డారో వివరాలు తెలియరాలేదు.
ISKCON Radhakanta temple in Bangladesh's Dhaka vandalised yesterday. More details awaited.
— ANI (@ANI) March 18, 2022
ఇది మొదటిసారి కాదు..
గతేడాది అక్టోబర్ 16న బంగ్లాదేశ్ నోఖాలీ నగరంలోని ఇస్కాన్ దేవాలయాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తుల సమూహం ధ్వంసం చేసింది. అదే సమయంలో ఓ భక్తుడ్ని కూడా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.
అయితే అంతకు ముందు అక్టోబరు 13న కుమిల్లాలోని పూజా మండపం వద్ద ఖురాన్ ను అవమానించారని ఆరోపణలు వచ్చాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఆ దేశంలో మతపరమైన హింసలు జరుగుతున్నాయి.
Also Read: South Korea Covid Cases: దేశంలో కరోనా కలవరం.. ఒక్కరోజే 6 లక్షల కరోనా కేసులు నమోదు!
Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook