James Webb Space Telescope Launch: ఖగోళ రహస్యాలను ఛేదించడానికి సిద్ధమైంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James Webb Space Telescope Launch). విశ్వం గుట్టును విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA). గయానా ( French Guiana) స్పేస్ సెంటర్ నుంచి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(JWST)ను విజయవంతంగా ప్రయోగించారు శాస్త్రవేత్తలు. డిసెంబర్ 25 ఉదయం 07:20 (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.50) దీనిని లాంచ్ చేశారు.
ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ (Ariane 5 Rocket) ద్వారా దీన్ని ప్రయోగించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. కాలంలో వెనక్కి వెళ్లి..విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను శోధించటం దీని ప్రత్యేకత. క్రిస్మస్ సందర్భంగా ఖగోళ శాస్త్రవేత్తలు, స్కైవాచర్లకు నాసా ప్రత్యేక కానుకను ఇచ్చింది.
Also Read: Bill Gates: 2022 చివరి నాటికి కొవిడ్ అంతం- అప్పటి వరకు జాగ్రత్త!
1990లో రోదసీలోకి ప్రవేశపెట్టిన 'హబుల్ స్పేస్ టెలిస్కోప్'(Hubble Space Telescope)నకు కొనసాగింపుగా దీనిని ప్రవేశపెట్టారు. స్పేస్ లో ప్రయోగించిన అతి పెద్ద టెలిస్కోప్ ఇదే. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ టెలిస్కోప్ చిత్రాలను తీస్తుంది. ఈ వెబ్ టెలిస్కోప్ తయారీకి సుమారు 73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ టెలిస్కోపు ప్రైమరీ మిర్రర్‌ను.. బంగారం పూతతో తయారు చేశారు. 5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్ సేవలందించనుంది.
Here it is: humanity’s final look at @NASAWebb as it heads into deep space to answer our biggest questions. Alone in the vastness of space, Webb will soon begin an approximately two-week process to deploy its antennas, mirrors, and sunshield. #UnfoldTheUniverse pic.twitter.com/DErMXJhNQd
— NASA (@NASA) December 25, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
James Webb Space Telescope: నింగిలోకి దూసుకెళ్లిన వెబ్ టెలిస్కోప్
నాసా ప్రయోగం సక్సెస్
నింగిలోకి దూసుకెళ్లిన వెబ్ టెలిస్కోప్
విశ్వం గుట్టును విప్పేందుకు రెడీ!