Japan Earthquake Scary Videos: జపాన్‌లో నూతన సంవత్సరం తొలిరోజే భారీ భాకంపం సంభవించింది. దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో జనం రోడ్లపై పరుగలు తీశారు. జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ఆస్థినష్టం భారీగా ఉందని తెలుస్తోంది. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
భారీ భూకంపం జపాన్‌లోని పశ్చిమ ప్రాంతాలు ఇషిగావా, నిగాటాయ టోయోమా జిల్లాల్ని అతలాకుతలం చేసింది. 21 సార్లు భూమి కంపించడమే కాకుండా అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదైంది. భారీ సునామీ హెచ్చరికలు జారీ అయినా వరుస భూ ప్రకంపనలతో బలహీనమైంది. దాంతో సునామీ హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు. 5-6 అడుగుల ఎత్తులో రాకాసి అలలు జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో విరుచుకుపడ్డాయి. సునామీ హెచ్చరిక నేపధ్యంలో తీరప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ కారణంగా భూమి ఎలా కంపించిందో ఈ వీడియో చూస్తే చాలు..
Video: The moment mega 7.6 magnitude #earthquake left #Japan shaking pic.twitter.com/RFjPuIlhkx
— Madhuri Adnal (@madhuriadnal) January 1, 2024
భూకంపం తీవ్రత కారణంగా భారీగా ఆస్థినష్టం సంభవించింది. ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం తెలియదు. దాదాపు 40 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులకు భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇషిగావో అణు విద్యుత్ కేంద్రం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం 1983 సీఆఫ్ జపాన్ భూకంపాన్ని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 324 మంది గాయాలపాలయ్యారు. భూకంపం వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
#Japan Earthquake/Tsunami. More footage taken today (most footage being shared is from 2011). pic.twitter.com/8tpB33ZMiH
— SacredEuropa ™ (@SacredEuropa) January 1, 2024
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. కొన్ని ఇళ్లకు భారీగా పగుళ్లు సంభవించాయి. జపాన్ రాజధాని నగరం టోక్యోలో కూడా భూమి కంపించింది. జపాన్ భూకంపం ప్రభావంతో ఉత్తర కొరియా, రష్యా దేశాలకు సైతం సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
The earth is pulsating in #Japan after the #earthquake 😳 pic.twitter.com/OhAGsAqyO7
— Tom (@TomTheNerdo) January 1, 2024
Also read: Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్ను వణికించిన భారీ భూకంపం, ఫోటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook