Missing Titanic Submarine Confirms Death: అట్లాంటిక్ మహాసముద్రంలో అదృశ్యమైన టైటాన్ సబ్‌మెరైన్‌లోని ఐదుగురు పర్యాటకులు మరణించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి టైటాన్ మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో టైటాన్ పేలిపోయిందని.. దీంతో ఇందులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని యూఎస్ కోస్ట్ గార్డు తెలిపింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో టైటాన్ శకలాలను గుర్తించామని.. టైటానిక్ షిప్ సమీపంలో శిథిలాలు కనిపించాయని పేర్కొంది. టైటానిక్ ఓడకు 488 మీటర్ల దూరంలో టైటాన్ సబ్‌మెరైన్ శకలాలు కనిపించాయని తెలిపింది.
రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ మాట్లాడుతూ.. ఐదుగురు పర్యాటకులు మరణించిన విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. తమ ఆలోచనలు అన్నీ మృతుల కుటుంబ సభ్యులతో ఉన్నాయని.. ఈ ప్రమాదంపై అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది, రెస్య్కూ సిబ్బంది తరుఫున తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామని అన్నారు. అదృశ్యమైన ఐదుగురు పర్యాటకులు మరణించడం విషాదాన్ని నింపుతోంది.
టైటానిక్ శిథిలాలను చూసేందుకు టైటాన్ మినీ జలాంతర్గామిలో ఐదుగురు పర్యాటకుల బృందం వెళ్లింది. ఈ బృందంలో బ్రిటీష్-పాకిస్థానీ బిలియనీర్ ప్రిన్స్ దావూద్ (48), ఆయన కుమారుడు సులైమాన్ (19), బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ టూరిస్ట్ పాల్ హెన్రీ నర్జియోలెట్, ఓసింగేట్ సీఈఓ స్టాక్టన్ రష్ ఉన్నారు. టైటానిక్ శిథిలాలు అట్లాంటిక్ మహా సముద్రంలో కేప్ కాడ్‌కు తూర్పున 1,450 కిలోమీటర్లు, న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణంగా 644 కిలోమీటర్ల దూరంలో 12 వేల అడుగుల లోతులో ఉన్నాయి. వీటిని చూసేందుకు ఈ ఐదుగురు మినీ జలాంతర్గామిలో గత ఆదివారం ఉదయం బయలుదేరారు. అక్కడికి చేరుకోవడానికి 8 గంటల ప్రయాణం పడుతుంది.
Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం
అయితే గత మూడు రోజులుగా టైటాన్ సబ్‌మెరైన్ ఆచూకీ గల్లంతైంది. మినీ జలాంతర్గామిని గుర్తించేందుకు కెనడా, అమెరికా కోస్ట్ గార్డు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ నిల్వలు 96 గంటలకు సరిపడా ఉండడంతో ముమ్మరంగా గాలించారు. క్షణక్షణం ఉత్కంఠ రేపగా.. చివరకు విషాదాన్ని మిగిల్చింది. గురువారం సాయంత్రం మినీ జలాంతర్గామి శకలాలను అమెరికా కోస్ట్‌గార్డ్ గుర్తించారు.
Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి